NGKL: ఏప్రిల్ 1 నుంచి 10 వరకు ‘ఇంటింటికి సీపీఐ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ ప్రకటించారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవడమే దీని లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపై పోరాటం కొనసాగిస్తామని, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.