CTR: సదుం మండలం కలకటవారిపల్లె సీతారామ స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి ఉదయం పంచామృతాభిషేకం, పూజలు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులకు వేదపండితుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం జరిపారు. సాయంత్రం గ్రామోత్సవం జరిగింది. భక్తులకు ఆలయ ఆవరణలో అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.