KDP: చిన్నమండెం మండలం వండాడి గ్రామంలోని గాండ్లపల్లిలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో టీడీపీ నాయకులు డా. మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ సుభిక్షం, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.