E.G: గోకవరం మండలం పెంటపల్లిలో గ్రామస్థుల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న రామాలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిర్మాణానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రూ. పది లక్షల విరాళం ఇచ్చారు. జగ్గంపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో పెంటపల్లి రామాలయం నిర్మాణ కమిటీ సభ్యులకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.