KMR: అదుపుతప్పి కారు బోల్తా పడి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.. ఈ ఘటన పోతంగల్ కలాన్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. గాంధారి మండలంలోని పోతంగల్ కలాన్ వద్ద బాన్సువాడ నుంచి గాంధారి వస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న కార్తీక్ అనే వ్యక్తి కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే108 ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.