TPT: నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేధనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా భక్తులు భారీగా పాల్గొన్నారు. సాయంత్రం ఉత్సవమూర్తుల తిరువీధి విహారం జరిగింది. ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.