TG: కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాళేశ్వరం అంశంలో తమ భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. అప్పుడు కాళేశ్వరం మొత్తం కుంభకోణం అని ఆరోపించారని.. ఇప్పుడు 3 బ్యారేజీల్లో మాత్రమే అవినీతి అంటున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం విచారణపై రాష్ట్రప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు.