KRNL: కృష్ణగిరి శివారులోని మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు ఈ నెల 31వ తేదీ చివరి రోజని ప్రిన్సిపల్ నిర్మల కుమారి ఇవాళ తెలిపారు. ప్రవేశం కోరుకునే విద్యార్థులు ఆన్లైన్లో నిర్ణీత రుసుము చెల్లించి గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, దరఖాస్తు ప్రక్రియపై సందేహాలు ఉంటే పాఠశాల కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.