E.G: గోకవరం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పవన్ కుమార్ను ఆదివారం నార్త్ జోన్ DSP సురేష్ బాబు అభినందించారు. చోరీ కేసులను, గంజాయి అక్రమ రవాణా, పలు కేసులను చాకచక్యంగా చేదించినందుకు కోరుకొండ సీఐ మూర్తి కార్యాలయంలో పవన్ కుమార్ అభినందించి ఆదివారం ప్రశంసా పత్రం అవార్డును అందించారు. ఈ సందర్భంగా ఎస్సైకు పలువురు అభినందనలు తెలిపారు.