BPT: బాపట్ల వెదుళ్లపల్లి చర్చి సమీపంలో రోడ్డు పక్కన నిలిపిన ఆటోను ఓ కారు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.