AKP: కలెక్టరేట్‌తో పాటు, డివిజన్ మున్సిపల్, మండల కార్యాలయాల్లో పీజీఆర్ఎస్తో పాటు రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని ఈనెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఓ ప్రకటనలో తెలిపారు. స్వయంగా రాలేని వారు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.