TPT: విశాఖపట్నానికి చెందిన దేవి ఫిషరీస్ సంస్థ ఆదివారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1,01,25,000 విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్లు ఇంద్రనీల్ చిట్టూరి, మహేంద్ర యార్లగడ్డ తిరుమలలోని టీటీడీ ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవోసి హెచ్. వెంకయ్య చౌదరికి విరాళం అందజేశారు.