KMM: నెలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని అరుణాచలం రైస్ మిల్లులో ప్రమాదవశాత్తు ఓ మహిళా కూలీ మృతి చెందారు. పప్పుల కళ్యాణి (34) మిల్లులో వరి పొట్టు కుప్ప వద్ద పని చేస్తుండగా, ప్రమాదవశాత్తు అందులో జారి పడ్డారు. భారీగా పొట్టు ఆమెపై పడటంతో శ్వాస అందక ఊపిరాడక ఆమె ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.