RR: మియాపూర్ వడ్డెరబస్తీలో శ్రీశ్రీశ్రీ మహాంకాళి రేణుక ఎల్లమ్మ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం స్థానిక నాయకులు, భక్తుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అట్టేపల్లి రామప్రభు, పురుషోత్తంల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణలో భక్తులు పాల్గొన్నారు.