JGL: జిల్లా వ్యాప్తంగా “అమ్మకు అక్షరమాల” కార్యక్రమంలో శిక్షణ పొందిన అభ్యాసకులకు పరీక్షలు నిర్వహించారు. జిల్లా DRDO సిబ్బంది ఆధ్వర్యంలో పరీక్షలు సజావుగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రాము, మల్యాల మండలం పోతారం, రాంపూర్ గ్రామాల్లోని పరీక్ష కేంద్రాలను సందర్శించి, నిర్వహణ తీరును,అభ్యాసకుల హాజరును, ఇన్విజిలేటర్ల సన్నద్ధతను పరిశీలించారు.