ప్రకాశం: పొన్నలూరు మండలం ఉప్పలదిన్నె గ్రామ పరిసరాలలో ఆదివారం ఎస్సై డ్రోన్ నిఘా కొనసాగించారు. అక్రమ కార్యకలాపాలు గుర్తించేందుకు, గంజాయి అక్రమ రవాణా వంటి కార్యకలాపాలపై పర్యవేక్షణ చేపట్టారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఈ డ్రోన్ నిఘా ఉపయోగపడుతుందని SI పేర్కొన్నారు.