WNP: ఇటీవల కాలంలో నూతనంగా నియమించబడ్డ కమిటీని కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ ఘనంగా సన్మానించారు. ఆదివారం శ్రీరంగాపురం మండల ఇంఛార్జ్ మన్యం, రాములు యాదవ్, శ్రీహరి రాజులను ఆయన శాలువాలతో సన్మానించారు. రాజేందర్ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.