CTR: చిత్తూరు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన జనగణన మూడవ రోజు ముగింపు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కే.మోహన్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనగణన పురోగతిపై సమీక్షించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. గ్రామ, వార్డు స్థాయిలో సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఖచ్చితమైన సమాచారం సేకరించాలని పేర్కొన్నారు.