ELR: ఉపాధి హామీ నిధులతో రహదారులకు మహర్దశ పట్టిందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. ఆదివారం ఉంగుటూరు మండలంలో కంసాల గుంట, ఎర్రమిల్లిపాడు గ్రామాల్లో ఉపాధి నిధులతో వేస్తున్న బీటీ రోడ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేసవిలో తాగునీరు ఇబ్బందులేకుండా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.