TG: తల్లిదండ్రులకు అండగా నిలవాలనే ‘ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ చట్టం’ తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మనదేశంలో బాలలు, వృద్ధులు, వికాలాంగుల కోసం అనేక చట్టాలున్నాయన్నారు. సమాజం తలదించుకునేలా కొంతమంది పిల్లలు ప్రవర్తిస్తున్నారని.. పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా దారపోస్తారు కానీ తల్లిదండ్రులను పిల్లలు రెక్కలు వచ్చాక పట్టించుకోవట్లేదన్నారు.