TPT: నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు సూళ్లూరుపేట డిపో అధికారులు ఆదివారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేట డీఎం కళ తన సిబ్బందితో కలిసి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు.