ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో పోలీసులు ఆదివారం ఉదయం కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామంలో సంచరిస్తున్నట్లయితే సమీప పోలీస్ స్టేషన్లో తెలపాలన్నారు.