AP: పశ్చిమ గోదావరి కనకాయలంక వద్ద గోదవరి నదీ పాయపై రూ.24 కోట్లతో నిర్మించే వంతెనకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ వంతెన నిర్మాణం పూర్తి అయితే కోనసీమ జిల్లా వాసులకు చాలా ఉపయోగమని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. వంతెనతో కనకాయలంక వాసులకు వరద కష్టాలు తప్పనున్నాయి. గోదావరి పాయ దాటి పి.గన్నవరం వైపు కనకాయలంక వాసులు చేరుకోనున్నారు.