SRCL: కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో చెరువులో మునిగి ఇద్దరు గొర్ల కాపర్లు ఆదివారం మృతి చెందారు. గ్రామానికి చెందిన మూడుకే లక్ష్మీరాజం (58) కుమ్మం మొండయ్య (50) గొర్రెలకు నీరు తాగించేందుకు చెరువులోకి తీసుకెళ్లారు. ఈక్రమంలో లోపలికి వెళ్లి 3 గోర్రెలను బయటకు తీస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.