వనపర్తి: పట్టణంలో ఆదివారం అంతర్జాతీయ మానవ హక్కుల సోషల్ జస్టిస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు హనీస్ ఫాతిమా జిల్లా హెచ్ఆర్సీ లోగోను విడుదల చేశారు. అనంతరం సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.