KRNL: 2026-27 విద్యా సంవత్సరానికి ఆర్టీఈ చట్టం ప్రకారం ఒకటో తరగతి ప్రవేశాలకు తొలి విడత లాటరీలో 2,734 మంది ఎంపికైనట్లు కర్నూలు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ లోక రాజు ఆదివారం తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఏప్రిల్ 7లోపు ఆయా పాఠశాలలో ఉచితంగా అడ్మిషన్ పొందాలి. సందేహాల కోసం 9000104836కు సంప్రదించాలని అయన సూచించారు.