NLG: జిల్లాలో ‘కత్తెర’ బత్తాయి పంట చేతికి వచ్చిన వేళ, ధరల లేకాపోవడంతో రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఓ వైపు ఎండల తీవ్రతతో నీటి కష్టాలను తట్టుకుని నాణ్యమైన పంటను పండించినప్పటికీ మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో అన్నదాతలు అల్లాడుతున్నారు. సాధారణంగా బత్తాయి టన్నుకు కనీస ధర రూ. 35 వేల నుంచి 40 వేల వరకు పలుకుతుందని పేర్కొన్నారు.