NRPT: ఊట్కూరు మండల పరిధిలో బిజ్వార్లో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయి. ఆదివారం గ్రామంలో పదో వార్డులో ఎంపీ డీకే అరుణ నిధులతో నూతన నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. సర్పంచ్ కొల్లంపల్లి ఆంజనేయులు, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు కలసి పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.