MNCL: మంచిర్యాల కార్పొరేషన్ 56వ డివిజన్లో ఆదివారం నిర్వహించిన ‘శుభ్రత-ప్రతి ఒక్కరి బాధ్యత’ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్ పాల్గొన్నారు. వర్షాకాలంలో ఎదురవుతున్న వరద ముంపు సమస్యలను కార్పొరేటర్ నల్ల శంకర్, స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ స్పందించి డ్రైనేజీల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, మంచినీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.