పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లక్ష్యంగా మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఇద్దరు నేతలు పాదయాత్రతో జనంలోకి వెళుతుండగా.. వారిని టార్గెట్ చేశారు. దీపంతో సిగరెట్ వెలిగించేవాడని తండ్రి గురించి పవన్ కల్యాణ్ ఓ సందర్భవంలో పేర్కొన్నారు. స్వర్గంలో ఉన్న తండ్రినే అవమానించిన పుత్రుడు ఈ సమాజానికి అవసరమా అని అడిగారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 400 రోజులు సుధీర్ఘంగా పాదయాత్ర కొనసాగనుంది. ఎలుక తోలు 400 రోజులు ఉతికినా నల్లగా ఉంటుందే తప్ప తెల్లగా మారదన్నారు. గావంచ కట్టినోడు గాంధీ కాలేడు.. పాదయాత్ర చేసినోడు నాయకుడు కాలేడు అని ఘాటుగా ట్వీట్ చేశారు.
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నేతలు యాత్రల బాట పట్టారు. వారిని లక్ష్యంగా చేసుకొని అంబటి రాంబాబు విమర్శలు చేశారు. విపక్ష నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే.. తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా నిలుస్తాయని వివరించారు.
ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు రాదు !
గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు !@naralokesh
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తొలి రోజే అపశృతి జరిగింది. లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయంలో పూజ చేసిన తర్వాత.. పక్కనే గల మసీదులో లోకేశ్ ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో తారకరత్న అక్కడే ఉన్నారు. మసీదు నుంచి బయటకు వచ్చిన సమయంలో అభిమానులు ఒక్కసారిగా వచ్చారు. దీంతో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే కుప్పం ఆస్పత్రికి తరలించారు. కాసేపు పల్స్ లేదని, శరీరం నీలి రంగులోకి మారిపోయిందని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించే అవకాశం ఉంది.