NLG: నకిరేకల్ ఎక్సైజ్ సీఐ మల్లయ్యతో పాటు సిబ్బంది తీరుపై శాలిగౌరారం మండలం ఊట్కూరుకు చెందిన గీత కార్మికుడు రాంమూర్తి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను తాటి చెట్టు దిగుతుండగా సిబ్బంది వచ్చి ఉచితంగా కల్లు తాగడమే కాకుండా బాటిళ్లలో నింపి ఇవ్వాలని ఒత్తిడి చేశారని తెలిపారు. అంతటితో ఆగకపోగ తర్వాతి రోజు కార్యాలయానికి పిలిపించి ఖర్చుల నిమిత్తం డబ్బులు అడిగారని ఆరోపించారు.