HYD: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎనిమిదో రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు సభలో ఏజెన్సీ ప్రాంత ఎస్సీలకు, మైదాన ప్రాంత ఎస్సీల మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో 15% రిజర్వేషన్ వర్తింపజేయాలనే అంశంపై చర్చ కోరుతూ వాయిదా ప్రతిపాదన ఇచ్చారు. ఈ విషయాన్ని అత్యవసర ప్రజా ప్రాముఖ్యతగా పరిగణించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు.