ADB: తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో ఎస్సై రాధిక ఆదివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామానికి పలు పనుల రీత్యా వచ్చిన ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసమ్మ, ఉప సర్పంచ్ అజయ్, ప్రకాష్, యువకులు, తదితరులు ఉన్నారు.