NTR: చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెంలో టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో మండల యూనిట్ ఇంఛార్జ్ కొల్లి రామారావు, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు సుధాకర్ పాల్గొని కేక్ కట్ చేసి, జెండా ఎగురవేశారు.తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టామన్నారు.