కృష్ణా: స్థిరమైన రాజధానితోనే సుస్థిర అభివృద్ధి సాధ్యం అని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. ఆదివారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మండలి వెంకట్రామ్, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని ఎంపిక చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయటం శుభ పరిణామం అన్నారు.