SKLM: కోటబొమ్మాలి మండలం నిమ్మడ గ్రామంలో తెలుగు దేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవాన్ని టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేశారు. ప్రజా సేవే పార్టీ ప్రధాన లక్ష్యమని, అదే దిశగా ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు.