TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. గన్తో కాల్చి పడేస్తానని సైగలు చేస్తూ బెదిరించారని ఆరోపిస్తూ, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వీడియో దృశ్యాలను పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు.