VZM: గజపతినగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో ఆదివారం ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా జాతీయ రహదారి పక్కన గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ పతాకాన్ని మంత్రి ఎగురువేశారు.