AP: ఉత్తరాంధ్ర జిల్లాల ముఖచిత్రాన్ని మార్చే శక్తి ఒక్క మూలపేట పోర్టుకే ఉందని YCP నేత ధర్మాన కృష్ణదాస్ అన్నారు. దీన్ని పూర్తిచేసి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. YCP హయాంలోనే 70% పనులు పూర్తి కాగా, కూటమి పాలనలో పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ఈ నెల 30న YCP పోర్టు యాత్ర చేపడుతున్నామని.. శాంతియుతంగా సాగే ఈ యాత్రకు పోలీసులు సహకరించాలని కోరారు.