ఏలూరు టీడీపీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి, ఇతర నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు పార్టీ స్థాపించి పేదలకు సంక్షేమ ఫలాలు అందించిన గొప్ప పార్టీ టీడీపీ అని కొనియాడారు.