KKD: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పుట్టిన తెలుగువారి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పేర్కొన్నారు. ఆదివారం చిన శంకర్లపూడిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద TDP 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్య ప్రభ TDP జెండాను ఆవిష్కరించారు.