TG: కాళేశ్వరం విచారణను BJP, BRS కలిసి అడ్డుకుంటున్నాయని CM రేవంత్ విమర్శించారు. 2014 నుండి జరిగిన మైనింగ్ అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించామని, దీనిపై హరీష్ రావు, KTR ఎందుకు ఆందోళన చెందుతున్నారని ప్రశ్నించారు. హరీష్ రావు సోదరుడి భూబదలాయింపుపై హౌస్ కమిటీ వేసేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మంత్రి పొంగులేటిని టార్గెట్ చేయడం తగదని, ఆధారాలుంటే CIDకి ఇవ్వాలని సూచించారు.