MHBD: గూడూరు మండల కేంద్రంలో నియోజకవర్గ సాధన సమితి కన్వీనర్ సురేందర్ ఆధ్వర్యంలో ఇవాళ సన్నాహక సమావేశం జరిగింది. గతంలో గూడూరు తాలూకా, సమితి కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతమని సురేందర్ అన్నారు. అసెంబ్లీ స్థానాల పునర్విభజనలో గూడూరును నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ సాధన కోసం ఏప్రిల్ 1న చేపట్టే సమావేశానికి అందరూ సహకరించాలన్నారు.