ఆసిఫాబాద్ జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ డెవిడ్ ప్రకటనలో తెలిపారు. పాఠకులకు తాగునీరు, కుర్చీలు, టేబుళ్లు, టాయిలెట్లు, ఫ్యాన్లు వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని చల్లని నీరు, ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పోటీ పరీక్షల పుస్తకాలు ఏర్పాటు చేయాలని సూచించారు.