తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లోని బిల్లుల వసూలు కేంద్రాలు 29వ తేదీ ఆదివారం సెలవురోజు కూడా పనిచేస్తాయని ఎస్ఈ కె. తిలక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో బిల్లులు చెల్లించి సంస్థకు సహకరించాలని కోరారు.