»Karnataka A Young Woman Named Davanagere Sneha Married Four Times Out Of Greed
Viral News: నలుగురిని పెళ్లి చేసుకున్న యువతి.. కారణం ఏంటంటే?
తన భార్య పుట్టింటికి వెళ్లి రావట్లేదని ప్రశాంత్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో అసలు విషయం బయటపడింది. తన భార్య స్నేహకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయని.. తాజాగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని కాపురం చేస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Karnataka, a young woman named Davanagere Sneha married four times out of greed.
Viral News: నిత్యపెళ్లికొడుకు గురించి మనకు తెలుసు, కట్నం కోసం ఆశపడి అమాయకులైన అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ ఇప్పుడు నిత్య పెళ్లికూతురుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. త్వరగా ధనవంతురాలు కావాలనే ఆశతో ఓ అమ్మాయి ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది. కర్ణాటకలో దావణగెరె ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన మహిళా జాతిని ముక్కున వేలేసుకునేలా చేసింది. నలుగురిని వివాహం చేసుకుని వంచించిన ఆరోపణలపై స్నేహ (25) అనే యువతిని దావణగెరె కేటీజే ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. మండ్య జిల్లా పాండవపురకు చెందిన స్నేహ రెండు సంవత్సరాల క్రితం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ప్రశాంత్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. అది కాస్త ప్రేమగా మారి ఆపై విహహం చేసుకుంది. పెళ్లి అయిన వీరిద్దరు దావణగెరెలో బాడుగ ఇంట్లో కాపురం ఉన్నారు. రెండు నెలల క్రితం తాను ప్రెగ్నెంట్ అని చెప్పి పుట్టింటికి వెళ్లింది.
తాను వెళ్లి రెండు నెలలు అవుతున్నా తిరిగి రావట్లేదు. ఫోన్ చేసి రమ్మని అడిగితే అందుకు నిరాకరించింది. దాంతో స్నేహ అడ్రెస్‌ను పట్టుకొని ఇంటికి వెళితే తాను అక్కడ లేదు. దాంతో తన భార్య కనిపించడం లేదని ప్రశాంత్ కేటీజే నగర ఠాణాలో ఫిర్యాదు ఇచ్చారు. దర్యాప్తులో పోలీసులకు అసలు విషయాలు తెలిశాయి. స్నేహకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయని, ప్రశాంత్ మూడో భర్త అని తెలుసుకున్నారు. తనకోసం గాలించగా బెంగళూరుకు చెందిన రఘు అనే మరో యువకుడిని మ్యారేజ్ చేసుకుంది. దాంతో తనను పట్టుకొని ఆరా తీయగా తన గతం గురించి చెప్పింది. మేలుకోటె నివాసి మహేశ్‌తో పెద్దలు పెళ్లి చేశారు. అతన్ని వదిలేసి బెంగళూరుకు చెందిన వెంకటేశ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. కొద్ది కాలానికి తనను విడిచి ప్రశాంత్‌ను చేసుకుంది. తాజాగా రఘును వివాహం ఆడింది. ప్రశాంత్ ఫిర్యాదుతో స్నేహను పోలీసులు అరెస్టు చేశారు.