TG: HYD నగరంలో గ్యాస్ కొరత తీవ్రమైంది. బంకుల చుట్టూ తిరిగినా గ్యాస్ లభించడం లేదని, అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. నగరంలోని దాదాపు 30 లక్షల ఆటోలకు ఇదే పరిస్థితి. పెట్రోల్‌తో నడిపితే నష్టాలు వస్తున్నాయని, వాహనాలను పక్కన పెడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్యాస్ సరఫరాపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.