అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత పనులు శర వేగంగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి నుంచి భవనం కూల్చివేత పనులు సాగుతున్నాయి. చుట్టుపక్కల భవనలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు పనులు చేయిస్తున్నారు. పోలీస్, ఫైర్ సిబ్బంది పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. భారీ క్రేన్ సాయంతో కూల్చివేత పనులు చేస్తోంది కాంట్రాక్ట్ సంస్థ. అయితే, ఇప్పటివరకు పది పన్నెండు శాతం పనులు మాత్రమే కంప్లీట్ చేసింది. బిల్డింగ్ 80శాతం డ్యామేజ్ కావడంతో అత్యంత జాగ్రత్తగా పనులు చేస్తోంది. బిల్డింగ్ పక్కకు ఒరగకుండా సెల్లార్లో ర్యాంప్ ఏర్పాటు చేశారు.
ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకపోతే 5 రోజుల్లో కూల్చివేత పనులు పూర్తికానున్నాయి. పక్క భవనాలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు వస్తే మాత్రం మరింత ఆలస్యంకావడం ఖాయంగా కనిపిస్తోంది.ఇవన్నీ పక్కనబెడితే, డెక్కన్ మాల్ దగ్గర పెను ప్రమాదం పొంచివున్నట్టే కనిపిస్తోంది. కూల్చివేత పనులు చేస్తోన్న కాంట్రాక్ట్ సంస్థ.. ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కూల్చివేతలు చేస్తుండగా భవన శిథిలాలు పక్క బిల్డింగ్స్ పడుతున్నాయి. డెక్కన్ మాల్ చుట్టూ ఎలాంటి పరదాలు కట్టకుండానే కూల్చివేతలు చేస్తోంది కాంట్రాక్ట్ సంస్థ.