విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సమ్మర్ షెడ్యూల్ నేటి నుంచి అక్టోబర్ 24 వరకు అమల్లోకి వచ్చింది. అధికారుల వివరాలు.. రోజుకు 33 విమానాలు నడుస్తుండగా, వింటర్ షెడ్యూల్‌తో పోలిస్తే 10-15% పెరిగాయి. ఇండిగో 21 సర్వీసులతో ముందంజలో ఉంది. అబుదాబి, సింగపూర్‌కు వారానికి 4 చొప్పున హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు సహా పలు నగరాలకు మెరుగైన కనెక్టివిటీ అందుబాటులో ఉంది.