అనంతపురంలోని టీటీడీసీ భవనంలో సెర్ప్-వెలుగు, ఇండస్ట్రీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వెదురు సాగుపై జిల్లాలోని 31 మండలాల ఏపీఎంలు, సీసీలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్డీఏ పీడీ శైలజ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల్లో వెదురు సాగు లాభదాయకమైన వరమని పేర్కొన్నారు. 37 సెంట్లలో 60 మొక్కలు నాటితే నాలుగో ఏడు నుంచి రూ. 50 వేల లాభం వస్తుందని అన్నారు.